సికింద్రాబాద్‌లో(Secunderabad) తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆస్తి నష్టం జరిగిందని, దానిని అంచనా వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. లోతుకుంట(Lothkunta) ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ సైకిల్ షాపులో తొలుత ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు.
సైకిల్ షాప్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న మరో ఐదు దుకాణాలకు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆగమేఘాలపై ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కావొచ్చని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
Read Also: ఓటీటీలోకి ‘మిరాయ్’ ఎంట్రీ..

