మైనర్ డ్రైవింగ్ : కారు నడిపిన బాలుడు.. తండ్రి అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ రాజేంద్రనగర్‌ (Rajendranagar)లో ఒక మైనర్ బాలుడు ఖరీదైన ‘ఎంజీ సైబర్‌స్టర్’ (MG Cyberster) కారును రోడ్డుపై నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై ట్రాఫిక్ పోలీసులు వేగంగా స్పందించారు. నిబంధనలను ఉల్లంఘించి వాహనాన్ని నడిపిన సదరు మైనర్ బాలుడిని, ఆ వాహనాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు, మైనర్ బాలుడి తండ్రి టోలీచౌకీకి చెందిన అబ్దుల్ హాదీని అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ట్రాఫిక్ పోలీసులు కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం, రోడ్లపై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయడం వంటి తీవ్రమైన అంశాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ (Rajendranagar) ఎస్‌హెచ్‌ఓ రాజు మాట్లాడుతూ.. మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు స్పష్టం చేశారు. ఒకవేళ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

Read Also: అక్క‌డ‌ బీచ్‌లో నిద్ర‌పోతున్న‌ జ‌నం.. ఎందుకంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>