ఫాస్ట్ ఫుడ్ గోడౌన్​లోకి అధికారులు.. లోపల చూస్తే షాక్​!

క‌లం, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌ (Hyderabad)లో మ‌రోసారి క‌ల్తీ ఫుడ్ దందా వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లైంది. శుక్ర‌వారం ఉద‌యం చార్మినార్‌ (Charminar)లోని హుస్సేని ఆలంలో హెచ్ ఫాస్ట్ అధికారులు నిర్వ‌హించిన దాడుల్లో (H Fast Raids) దారుణ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. స్థానికంగా చాలా ఫేమ‌స్ అయిన అల్ అక్బ‌ర్ ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్‌కు సంబంధించిన గోడౌన్‌పై అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఈ గోడౌన్ కొన‌సాగుతున్న‌ట్లు అధికారుల త‌నిఖీల్లో తేలింది.

గోడౌన్‌లో రసాయనాలు, ప‌లుమార్లు వాడి నిల్వ ఉంచిన నూనెను గుర్తించారు. నిర్వాహ‌కులు ఇదే నూనెను వాడి చికెన్ వండుతున్నారు. దీంతో క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని అధికారులు తెలిపారు. గౌడౌన్ మొత్తాన్ని ప‌రిశీలించి 110 కేజీల చికెన్, 90 లీటర్ల వంట‌ నూనె, రసాయనాలనును అధికారులు సీజ్ చేశారు. ఫాస్ట్ సెంట‌ర్ నిర్వాకులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, పరిశుభ్రత, నాణ్యత విషయంలో రాజీ పడితే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరించారు.

Read Also: ఎల్ నినో కరువు ముప్పు.. తాతలనాటి నేరేడు రహస్యం ఏం చెబుతోంది?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>