మందుబాబులకు సమ్మర్ షాక్.. లిక్కర్, బీర్ ధరలు హైక్ !

కలం, తెలంగాణ బ్యూరో : Beer and Liquor Prices | ఇరాన్‌లో యుద్ధం (Iran War) అన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్నట్లుగానే భారత్‌పైనా ఎఫెక్ట్ పడింది. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, యూరియా.. ఇలాంటివాటిపైనే కాకుండా మద్యం (Alcohol) మీదా ప్రభావం చూపుతున్నది. ఇప్పుడున్న ధరలను పెంచకపోతే సప్లై చేయడం సాధ్యం కాదంటూ లిక్కర్, బీర్ తయారీ కంపెనీలు మొత్తుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాయి. ఈసారి సమ్మర్ హీట్ కాస్త ఎక్కువగానే ఉంటుందంటూ కేంద్ర వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బీర్‌తో చిల్ అవుదామని యూత్, మందుబాబులు అడ్జస్ట్ అయిపోతున్నారు. కానీ ఇంతలోనే వారికి ఊహించని షాక్ తగిలేలా ఉంది. లిక్కర్, బీర్ ధరలను పెంచాల్సిందేనంటూ తయారీ కంపెనీలు ప్రభుత్వాలకు రాతపూర్వకంగా రిక్వెస్టు పెట్టాయి. ఇరాన్ యుద్ధంతో అటు ప్లాస్టిక్, గ్లాస్ బాటిల్స్, ఇటు అల్యూమినియం టిన్స్ తయారీ ఖర్చు పెరిగిపోతున్నదని, ధరలు పెంచాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నది ఆ కంపెనీల వాదన.

ముడిపదార్ధాల భారంతో రేట్ల పెంపు ప్రతిపాదన :

ఇరాన్ యుద్ధం కారణంగా ఇండస్ట్రియల్ డీజిల్ రేటు పెరిగిందని, ప్లాస్టిక్ బాటిళ్ళ తయారీకి అవసరమయ్యే పాలీ ప్రొపిలీన్, ఇతర రసాయనాల ధరలు పెరిగాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బీవరేజ్ కంపెనీస్ (CIABC) డైరెక్టర్ జనరల్ అనంత్ అయ్యర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ధరల పెరుగుదల వలన లిక్కర్ ధరలను పెంచక తప్పదని వివరించారు. కనీస స్థాయిలో వంద రూపాయలు, గరిష్టంగా 200 రూపాయల వరకు పెంచాల్సి ఉంటుందన్నారు. ఆయా బ్రాండ్ మద్యం ధరలకు అనుగుణంగా ఇకపైన పెంచాల్సి వస్తుందన్నారు. మరోవైపు బీర్ ధరలను (Beer and Liquor Prices) సైతం పెంచాల్సి వస్తుందని బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశామని, ఒక్కో కేసుపై (12 బీర్ బాటిళ్లు ఉండే బాక్స్) కనీసంగా రూ. 30 వరకు పెంచక తప్పదన్నారు.

పెట్రో ప్రోడక్ట్స్ ధరలతో చైన్ ఎఫెక్ట్ :

ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాకు ప్రపంచవ్యాప్తంగానే అంతరాయం కలిగింది. బీర్ కోసం వాడే గాజు బాటిళ్ళ తయారీ ప్రక్రియలో హీటింగ్ ఎఫెక్టు కోసం ఎల్పీజీ, డీజిల్ వినియోగం తప్పనిసరి. కానీ సరఫరాలో తలెత్తిన సంక్షోభం కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగింది. దీంతో గాజు బాటిళ్ల తయారీ కంపెనీలు ధరలు పెంచాల్సి వచ్చింది. వాటి నుంచి సమకూర్చుకునే మద్యం తయారీ కంపెనీలు సైతం ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. దీంతో హోల్‌సేల్ మొదలు రీటెయిల్ సేల్స్ వరకు ధరలు పెరుగుతున్నాయి. సమ్మర్‌లో హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ స్థాయిలో బీర్ విక్రయాలుంటాయి. ధరలు పెరగడంతో మందు బాబులకు ఇరాన్ యుద్ధంతో ఊహించని షాక్ తగిలినట్లయింది. లిక్కర్, బీర్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎంత ధర పెంచుతుందన్నది ఉత్కంఠగా మారింది.

Read Also: ఈ అలవాట్లే ఆఫీసులో మీ ఇమేజ్‌ను తగ్గిస్తున్నాయ్‌..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>