అజారుద్దీన్(Azharuddin)కు మంత్రి పదవి అన్న అంశం కేవలం ఎన్నికల ప్రచార స్టంటే అని కాంగ్రెస్ మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఒకవైపు ప్రమాణ స్వీకారానికి అంతా రెడీ అయిందని వార్తలు, ప్రమాణ స్వీకారాన్ని కోరుతూ అధికారులకు ప్రభుత్వం రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయడం జరిగింది. ఇంత జరిగినా అజారుద్దీన్‌కు మంత్రి పదవి అసలు విషయాన్ని కాంగ్రెస్ మాత్రం చెప్పడం లేదు. తాజాగా ఇదే అంశంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) మాట్లాడుతూ.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి అన్న విషయం తానూ మీడియాలోనే చూస్తున్నానని, తనకు దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని అన్నారు.
ఒకవైపు డిప్యూటీ సీఎం భట్టి(Bhatti Vikramarka) ఏమో.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా ఉండటానికి కుట్రలు జరుగుతున్నాయంటే, మంత్రి వర్గంలో ఉన్న శ్రీధర్ బాబు(Sridhar Babu) అసలు తనకు ఈ అంశానికి సంబంధించి సమాచారమే లేదంటున్నారు.
దీంతో అజారుద్దీన్‌కు మంత్రి పదవి అంటూ కాంగ్రెస్ కేవలం ప్రచారమే చేస్తుందని, జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలో మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపై ఓటర్లలో సైతం తీవ్ర అయోమయం ఉంది. మరి ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అధికారికంగా ఏమైనా ప్రకటన చేస్తుందా? లేదా ఎన్నికల పూర్తయ్యే వరకు ఈ అంశాన్ని అంతే ప్రచారం కోసం వినియోగించుకుంటుందా అనేది చూడాలి.
Read Also: మాగంటి సునీతపై కేసు నమోదు..

