కలం, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli) తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా తనకు శాపంగా మారుతుందని ఏనాడూ అనుకోలేదని, నిజానిజాలు తెలుసుకోకుండా తనను నిందించడం సరికాదని కన్నీరు పెట్టుకున్నారు. మైక్రో ఫైనాన్స్ (Micro Finance) పేరిట తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వివాదంపై పోరాడడానికి తాను ఎక్కడికైనా రావడానికి సిద్ధమని మంగ్లీ స్పష్టం చేశారు. కేవలం బిగ్‌బాస్ షోకి వెళ్లేందుకు, పాపులారిటీ సంపాదించుకోవడానికే సుబ్బారావు అనే అడ్వకేట్ తన పేరును వాడుకుంటున్నారని మంగ్లీ తీవ్ర ఆరోపణలు చేశారు. అనవసరంగా తనను వివాదాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని మంగ్లీ (Singer Mangli) కోరారు.
Read Also: మృణాల్ పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!
Follow Us On : WhatsApp

