టీవీకే సీనియర్ మంత్రి.. జేబులో జయలలిత ఫొటో

కలం, వెబ్ డెస్క్: టీవీకే ప్రభుత్వంలో సీనియర్ మంత్రి సెంగొట్టయన్ (Sengottaiyan) చేసిన ఓ పని నెట్టింట వైరలవుతోంది. ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో.. ఆయన జేబులో మాజీ సీఎం జయలలిత ఫొటో పెట్టుకుని రావడం గమనార్హం. అన్నాడీఎంకేను తీవ్రంగా వ్యతిరేకించే టీవీకే పార్టీకి కీలక నేతగా ఉన్న సెంగొట్టయన్.. జయలలిత ఫొటో పెట్టుకుని రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఆమె ఫొటోను జేబులో పెట్టుకోవడానికి సీఎం విజయ్ కూడా అంగీకరించినట్లు సమాచారం.

ఒకప్పుడు ప్రధాన అనుచరుడిగా..

1990లో అన్నాడీఎంకేలో చేరిన సెంగొట్టయన్.. కొద్ది సమయంలోనే జయలిలతకు నమ్మిన బంటుగా మారారు. అయితే, పార్టీలో వర్గ పోరు మొదలవడంతో అంతర్గత రచ్చ మొదలైంది. దీంతో, సెంగొట్టయన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 2000 సంవత్సరంలో ఆయన్ను పార్టీ నుంచి జయలలిత సస్పెండ్ చేశారు. దీంతో, ఆయన పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం దూరంగా ఉన్నారు. తరువాత కాలంలో మళ్లీ జయలలితకు దగ్గరై.. అన్నాడీఎంకేలో చేరారు. అనంతరం, జయ క్యాబినెట్‌లో కీలకమైన రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు. జయలిలత మరణం వరకు ఇద్దరు కలిసే పనిచేశారు. ఆ అభిమానంతోనే తాను మరోసారి మంత్రి అయిన వేళ.. జయలలిత ఫొటో పెట్టుకుని వచ్చారని తమిళ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>