కలం, వెబ్ డెస్క్ : సింగపూర్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (JISC) ప్రతినిధులతో అమరావతి (Amaravati) ఆర్థిక ప్రాంత అభివృద్ధి, సమగ్ర టౌన్‌షిప్ నిర్మాణంపై కీలక చర్చలు జరిపినట్లు.. సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. అమరావతిను భారతదేశానికి ఆదర్శవంతమైన మోడల్ టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దేందుకు సింగపూర్ నైపుణ్యం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఆగ్నేయ, తూర్పు ఆసియా దేశాలను అనుసంధానించే గ్లోబల్ MICE , ట్రేడ్ గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా పాలన, పట్టణ ప్రణాళిక, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆర్థికాభివృద్ధి రంగాలలో ఆంధ్రప్రదేశ్–సింగపూర్ భాగస్వామ్యం మరింత బలపడుతోందని లోకేశ్ వెల్లడించారు.

