Mobile Popup Ad
Mobile Popup Ad

ఉద‌య‌నిధి స్టాలిన్‌ ప్రోగ్రామ్‌లో విజ‌య్ పార్టీ జెండాలు!

క‌లం వెబ్ డెస్క్ : త‌మిళ‌నాడులో పొంగ‌ల్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ వేడుక‌ల్లో ఎంతో ప్ర‌త్యేకంగా నిలిచే జ‌ల్లిక‌ట్టు(Jallikattu) క్రీడ గురువారం అవ‌నియాపురంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. మ‌ధురై, పాల‌మేడు, ఆలంగ‌న‌ల్లూరులో ఈ క్రీడ వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) శుక్ర‌వారం ఉద‌యం మ‌ధురై(Madurai) జిల్లా పాల‌మేడులో జ‌ల్లిక‌ట్టు ప్రారంభించారు. స్థానికంగా అధికార యంత్రాంగం జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హ‌ణ కోసం ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుక‌ల్లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. కొంద‌రు వ్య‌క్తులు విజయ్(Vijay) పార్టీ టీవీకే(TVK Party)కు చెందిన‌ జెండాల‌తో సంద‌డి చేశారు. చేతిలో జెండాలు ప‌ట్టుకొని ప్ర‌ద‌ర్శిస్తూ అరుస్తూ గోల చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>