Mobile Popup Ad
Mobile Popup Ad

ప్ర‌పంచంలో అతిపెద్ద ఆయిల్ రీఫైన‌రీపై ఇరాన్ డ్రోన్ దాడి!

క‌లం, వెబ్ డెస్క్‌: సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడుల‌తో రెచ్చిపోయింది. ఈ క్ర‌మంలో సౌదీలోని అరామ్‌కో ఆయిల్ రీఫైన‌రీ (Aramco Oil Refinery)కి గట్టి దెబ్బ తగిలింది. రాస్ త‌నూరా ప్రాంతంలో ఉన్న అరామ్‌కో ప్ర‌పంచంలో అతిపెద్ద ఆయిల్ రీఫైన‌రీల్లో ఒక‌టిగా పేరు గాంచింది. ఈ దాడిలో భారీగా మంటలు చెలరేగాయి, వాటిని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఇరాన్ దాడితో సౌదీ అరేబియా ఆయిల్ రీఫైన‌రీని తాత్కాలికంగా మూసివేసింది. ఈ ఘటనలో ప్రాణనష్టం లేకపోయినా, చమురు ఉత్పత్తి, ప్రపంచ ముడి చమురు ధరలపై ప్రభావం ఉంటుందేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రోవైపు ఇరాన్ దాడుల‌ను తీవ్ర‌త‌రం చేస్తూ త‌న వ్యూహాన్ని మార్చుకున్న‌ది. ఇజ్రాయెల్, అమెరికా స్థావ‌రాల‌తో పాటు వీటికి మద్దతు ఇస్తున్న దేశాల ప్రజలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్ ప్రాంతాల్లోని నివాసాలే టార్గెట్‌గా దాడులు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే హైరైజ్ భవనాలు, అపార్ట్‌మెంట్లు ఖాళీ చేసి ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లిపోతున్నారు. దుబాయ్‌లోని అత్యంత ఎత్తైన భ‌వ‌నం బుర్జ్ ఖ‌లీఫా కూడా ఇప్ప‌టికే ఖాళీ అయ్యింది. ఆదివారం ఇరాన్ దాడిలో బుర్జ్ ఖ‌లీఫా స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్న‌ది. భ‌వ‌నంలో భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి.

Read Also:

Read Also: రేవంత్ ఫిట్‌నెస్‌పై రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>