కలం వెబ్ డెస్క్ : ఇటీవల ఓ మంత్రి(Minister), ఐఏఎస్(IAS) అధికారిపై వచ్చిన వార్తలపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులపై ఫేక్ కథనాలు(Fake News) రూపొందించి ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం అని అన్నారు. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా, బద్నాం చేసే విధంగా కొందరు ఆలోచిస్తున్నారన్నారు. స్వేచ్ఛను హరిస్తూ, వ్యక్తిగత విషయాలపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. ధైర్యం ఉంటే ఆధారాలతో సహా బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఊహాజనితక కథనాలు రూపొందించి ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటే కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఎవరి కుటుంబాల్లో అయినా, రాజకీయ, ప్రభుత్వ, మీడియా రంగంలో ఉన్న స్త్రీలకైనా నష్టం చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కుట్రలు చేసి, నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తే దాని వెనుక ఉన్నవారు ఎవరైనా బాధ్యత వహించాల్సిందేనని చెప్పారు.


