ఉద్యమకారులకు సముచిత గౌరవం : మంత్రి పొన్నం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఉద్యమకారులకు సముచితంగా గౌరవించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. గురువారం సచివాలయంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష సభ్యులతో భేటీ అయింది. ఈ సందర్భంగా కమిటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొన్నం మీడియాకు వెల్లడించారు. పార్టీలు మాత్రమే కాకుండా ఉద్యోగ, విద్యార్థి, జర్నలిస్ట్, న్యాయవాదులు అందరినీ పిలిచి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. గాయాలతో పాటు వివిధ విభాగాలుగా నష్టం జరిగిన వారికి న్యాయం చేస్తామని పొన్నం హామీ ఇచ్చారు.

కవులు, కళాకారులతో సహా తెలంగాణ సాధన కోసం పని చేసిన అందరిని గుర్తిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా సలహాలు సూచనలు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు. ఆన్‌లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ విజ్ఞప్తులు, అర్జీలు తీసుకుంటామని చెప్పారు. అమరవీరుల (Telangana Martyrs) ద్వీపంలో కమిటీ కార్యాలయం ప్రారంభం అవుతుందని పొన్నం (Minister Ponnam) తెలిపారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమం తొలి, మలి దశలలో, క్షేత్రస్థాయి ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి పారదర్శకంగా అర్హుల జాబితా తయారీకి తగు కార్యాచరణ రూపొందించాలని అధికారులను కమిటీ ఆదేశించింది అని మంత్రి వెల్లడించారు.

Read Also: ప్రజల భయంతోనే సీఎం ఆకాశమార్గ పర్యటన: నిరంజన్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>