జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మూడేండ్లలో ఈ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని మంత్రి పొంగులేటి(Ponguleti) హామీ ఇచ్చారు. పేదలకు గృహసంక్షేమం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఇందిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పొంగులేటి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రెహమత్‌నగర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన మంత్రి, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం దిశగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
“ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ప్రతి అర్హుడికి గృహం కల్పించడమే మా లక్ష్యం. ఎవ్వరూ ఇల్లు లేక అద్దెల జీవితంలో ఇబ్బందులు పడకూడదు. పేదవారికి గౌరవప్రదమైన జీవితం అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది,” అని మంత్రి Ponguleti చెప్పారు. భారత రాష్ట్ర సమితి గత పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్ వంటి నగర హృదయ ప్రాంతాల్లో కూడా మౌలిక వసతుల కొరతను తీర్చలేకపోయిందని ఆయన విమర్శించారు. “రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక వసతుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కానివే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యలన్నీ ప్రాధాన్యతతో పరిష్కరిస్తోంది,” అని తెలిపారు.
తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) ను గెలిపిస్తే మూడు సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పూర్తిగా మారుస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను నమ్మకద్రోహం చేశాయని, ఇప్పుడు మళ్లీ వాగ్దానాలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మంత్రి విమర్శించారు. “ప్రజలు ఇక మోసపోవద్దు. అభివృద్ధి, సంక్షేమం కోరుకునే వారంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి తోడుగా ఉండాలి,” అని పిలుపునిచ్చారు.
Read Also: బీహార్‌లో పోటాపోటీ హామీలు.. అమలు సాధ్యమేనా?
Follow Us On : Instagram

