ఐఏఎస్ అధికారి రాజీవ్‌కు గాయాలు.. ఫోన్‌లో పొంగులేటి పరామర్శ

కలం, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రాజీవ్ హనుమంతు (IAS Rajiv Hanumanthu)ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ఫోన్‌లో పరామర్శించారు. రాజీవ్ హనుమంతుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గాయపడిన విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించారు. ఫోన్‌లో రాజీవ్ హనుమంతుతో మాట్లాడి ఆయనతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ హనుమంతు కుటుంబ సభ్యులకు మంత్రి ధైర్యం చెప్పారు.

ఆందోళన చెందవద్దని, అవసరమైన మెరుగైన వైద్య సేవలు పొందాలని పొంగులేటి (Minister Ponguleti) సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా కల్పించారు. వైద్య చికిత్స విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రాజీవ్ హనుమంతు, ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాళ్లపల్లి వద్ద తిరుమల నుంచి శ్రీశైలం వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐఏఎస్ అధికారి రాజీవ్ హనుమంతుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు.

Also Read : కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ.. ఇందులో ఇన్ని ట్విస్టులా..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>