కలెక్టరేట్ ముందు కాంట్రాక్ట్ కార్మికుల నిరసన

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆస్ప‌త్రి కాంట్రాక్టు కార్మికులు దగా పడుతున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్‌వైజ‌ర్‌ కాంట్రాక్టు కార్మికులకు (Hospital Contract Workers) ప్రభుత్వం తక్షణమే రూ.26,000 కనీస వేతనం పెంచాలని, కాల పరిమిత ముగిసిన ఏజెన్సీలను రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా కార్మికులకు వేతనాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పండగ జాతీయ ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని తదితర కోరుతూ, డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ మొండి తీరును నిరసిస్తూ సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్ట‌డించారు. కలెక్టరేట్ లోప‌లికి వెళ్లేందుకు యత్నించిన కాంట్రాక్టు కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు కలెక్టరేట్ గేటు ఎదుట పడుకొని వినూత్నంగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అనంతరం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్‌కు విన‌తి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పద్మావతి, తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా నేతలు కార్మికులు రంగన్న, నరసింహ, చెన్నయ్య, బాలకోటి, మన్యం, భీమన్న, అంజి, నరేష్, యాదయ్య, గంగాధర్, కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, నైసన్, వెంకటయ్య, మన్యం, గోపాల్, యాదగిరి, శ్రీను, నాయక్ చిన్నయ్య, సత్యమ్మ, నాగమణి, చంద్రకళ, సువర్ణ, లక్ష్మి, సాయమ్మ, లక్ష్మమ్మ, వెంకటమ్మ, మంగమ్మ, తిరుపతమ్మ, జ్యోతి, సునీత, మంజుల, జమున, లక్ష్మి, మంజుల, జంగమ్మ మీనా కవిత నిర్మల, మమత, చెంచు లక్ష్మమ్మ, విజయ నిర్మల, శిరీష, సరోజ, చెన్నమ్మ, జ్యోతి, కవిత, సవిత, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>