కలం, వెబ్ డెస్క్ : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన భర్త గౌతమ్ కిచ్లుతో తనకున్న అనుబంధం, వారి ప్రేమకథ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వీరిద్దరూ దాదాపు 13-14 ఏళ్ల క్రితమే మొదటిసారి ప్రేమలో పడ్డారని, అయితే అప్పట్లో కొన్ని కారణాల వల్ల వారి మధ్య బంధం కొనసాగలేదని కాజల్ తెలిపారు. దాంతో ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు.
ఆ తర్వాత ఇద్దరూ వేరే వ్యక్తులతో డేటింగ్ చేసినప్పటికీ, ఆ అనుభవాల ద్వారానే తమ మధ్య ఉన్న బంధం ఎంత ప్రత్యేకమైనదో అర్థమైందని కాజల్ (Kajal Aggarwal) చెప్పుకొచ్చారు. కోవిడ్ సమయంలో వీరిద్దరూ మళ్లీ కలుసుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో ప్రేమ తిరిగి చిగురించిందని తెలిపారు. ఆ బంధం కాస్తా పెళ్లికి దారితీసి, 2020 అక్టోబర్ 30న ముంబైలో సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
Also Read : అమితాబ్ బచ్చన్ ఇంటిపై కాల్పులకు కుట్ర.. ఇద్దరు అరెస్ట్!
Follow Us On : WhatsApp

