కలం, నిర్మల్: సారంగాపూర్ మండలం యాకర్‌పల్లి (Yakarpalli) గ్రామంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీ ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ (Muthyalamma Temple) విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రారంభోత్సవ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని గ్రామస్థులు ఆహ్వానించారు.
ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యేను జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో కలిసి వేడుకలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ నరేష్, గ్రామ ఉపసర్పంచ్ శ్రీకాంత్, నాయకులు మేకల చంద్రశేఖర్, మేకల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

