మరో రెండు రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం!

కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ (Bomraspeta) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని నాందార్ పూర్ గ్రామ శివారులో తుంకిమెట్ల– నుంచి కోస్గి వెళ్లే రహదారిపై వేగంగా వస్తున్న కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మృతుల్లో కారులో ప్రయాణిస్తున్న లగచర్ల గ్రామానికి చెందిన శ్రీశైలం ఉన్నాడు. మరో రెండు రోజుల్లో అతనికి వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహ పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన లగచర్లకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>