కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిలో నూతన హైకోర్టు భవనాల నిర్మాణ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana ) ప్రారంభించారు. రాఫ్ట్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి మంత్రి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు అంతస్తుల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో 7 అంతస్తుల్లో ఐకానికి భవనంగా హైకోర్టును నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 21 లక్షల చదరపు అడుగుల విస్తిర్ణంలో 52 కోర్టు హాళ్లతో భవన నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణానికి మొత్తం 45 వేల టన్నుల స్టీల్ ను వినియోగిస్తున్నట్లు వివరించారు. హైకోర్టు భవనం పనులు ప్రారంభం కావడం రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టమని Minister Narayana అభివర్ణించారు.


