కలం డెస్క్ : ఒకవైపు క్రిస్మస్ (Christmas) సందడితో ఉద్యోగులు సెలెబ్రేషన్ మూడ్‌లోకి వెళ్ళిపోయారు. ఇంకోవైపు ఇయర్ ఎండింగ్ కోలాహలంతో లీవ్ మూడ్ వచ్చేసింది. దీంతో ఐఏఎస్ అధికారుల మొదలు క్రిందిస్థాయి సిబ్బంది వరకు హాలీడే మూడ్‌లో ఉన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా 25 ఎలాగూ పబ్లిక్ హాలీడే. దాని మరుసటి రోజు ‘బాక్సింగ్ డే’ (Boxing Day) పేరుతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. క్రిస్మస్ ముందు రోజున ఆప్షనల్ హాలీ డే కావడంతో చాలామంది ఉద్యోగులు వరుసగా మూడు రోజులు లీవ్‌లో ఉండిపోయారు. దీంతో సచివాలయంలోని (Telangana Secretariat) చాలా డిపార్టుమెంట్లలో ఉద్యోగుల అటెండెన్స్ అంతంత మాత్రంగానే నమోదైంది. ఎప్పుడూ సందర్శకుల తాకిడితో ఉండే సెక్రెటేరియట్ బోసిపోయి కనిపిస్తున్నది.
వచ్చే వారమంతా హాలీ డే మూడ్ :
క్రిస్మస్ పండుగ సందడి ముగియగానే ఇయర్ ఎండ్, వీకెండ్ మూడ్ మొదలవుతుంది. డిసెంబరు 27 శనివారం, డిసెంబరు 29 మాత్రమే వర్కింగ్ డేస్. మధ్యలో సండే, ఆ తర్వాత డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ దర్శనాలు, మరుసటి రోజు డిసెంబరు 31న ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ తో మళ్ళీ హాలీడే మూడ్ కంటిన్యూ అవుతుంది. ఉద్యోగులు చాలామంది అటెండ్ కాబోమంటూ ఇప్పటి నుంచే షెడ్యూలు ఫిక్స్ చేసుకున్నారు. జనవరి ఫస్ట్ తారీఖు న్యూ ఇయర్ డే సందర్భంగా ఎంప్లాయీస్ డిఫరెంట్ మూడ్‌లో ఉంటారు. మధ్యలో డిసెంబరు 29న అసెంబ్లీ సెషన్ కావడంతో సచివాలయం (Telangana Secretariat) ఉద్యోగుల్లో చాలామంది లేట్ కమింగ్.. ఎర్లీ గోయింగ్.. అనే విధానంలో పడతారు. కీలకమైన ఉన్నతాధికారులు మాత్రం అసెంబ్లీ డ్యూటీలో మునిగిపోతారు.
Read Also: ట్యాపింగ్ విషయం ఎప్పుడు తెలిసింది? : మాజీ డీజీపీని ప్రశ్నించిన సిట్
Follow Us On: Youtube


