ఏపీలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నాం: లోకేశ్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు(CII Summit)లో భాగంగా రాష్ట్రంలోని ఆవిష్కరణలు, స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు విశాఖపట్నంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఏపీ స్టార్టప్ ఎక్స్ఛేంజ్ (APEX) కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రతిభావంతమైన 6 స్టార్టప్ నిర్వాహకులను మంత్రి సత్కరించారు. రాష్ట్రంలో తొలిసారిగా 31 స్టార్టప్ లకు తొలివిడతగా రూ.2.11 కోట్ల ఆర్థికసాయం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి (Nara Lokesh) మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25 విభిన్న పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ ఎకోసిస్టమ్‌లను సిమెంట్ వంటి రంగాల నుంచి క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల వరకు నిర్మిస్తున్నామని చెప్పారు. ఏపీలో క్వాంటం ఎకోసిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

సిమెంట్, స్టీల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంగాట్, సోలార్, వేఫర్, సెల్ తయారీ, ఎయిర్ కండిషనింగ్, ఆక్వా, క్వాంటం, మెడికల్ డివైజెస్, ఫార్మా, డేటా ఎకోసిస్టమ్ వంటి మొత్తం 25 రంగాలకు సంబంధించిన ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించడానికిఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు గొప్ప విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.

Also Read : న్యూ లుక్‌లో కీర్తి సురేశ్..‘సత్యవాన్ సావిత్రి’ ట్రైలర్ రిలీజ్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>