రాహుల్ గాంధీ, రేవంత్ మార్నింగ్ వాక్.. ఎక్కడో తెలుసా!

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం మార్నింగ్ వాక్ చేయబోతున్నారు. ఇటీవల హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువు(Thammidikunta Lake)పై ఇద్దరు నేతలు కలిసి కొంతసేపు వాకింగ్ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వాకింగ్ చేస్తూ స్థానికులతో మాట్లాడుతారని, చెరువును అభివృద్ధి చేయడం వలన కలిగిన ప్రయోజనాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌(Bharat Summit)లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని తమ్మిడికుంట చెరువు వద్దకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ భావించడంతో.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు.

అర్ధరాత్రి హైదరాబాద్‌కు రాక..

రాహుల్ గాంధీ (Rahul Gandhi) అర్ధరాత్రి ఒంటి గంటకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసీసీ హోటల్‌కు వెళ్లి బస చేస్తారు. ఉదయం తమ్మిడికుంట చెరువు వద్దకు వెళ్లి మార్నింగ్ వాక్ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జయభేరి గార్డెన్‌లో గిగ్ వర్కర్లతో జరిగే సమావేశంలో రాహుల్ పాల్గొంటారు. మధ్యాహ్నం ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో పాల్గొని, విదేశీ ప్రతినిధులతో భేటీ అవుతారు. సమావేశం ముగిసిన వెంటనే పార్టీ నేతలతో భేటీ అవుతారు. రాత్రి 8 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు.

Also Read : భారత్ సమ్మిట్.. దేశ వ్యతిరేకుల కలయిక వేదిక: బండి సంజయ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>