కలం, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘సత్యవాన్ సావిత్రి’(Sathyavan Savithiri). ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కామెడీ, కోర్టు డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో కీర్తి సురేష్ లాయర్‌గా కనిపించి ఆకట్టుకుంది. ట్రైలర్లో సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి.
బలవంతంగా వివాహం జరిగినప్పటికీ, అనుకోని పరిస్థితుల్లో హత్య కేసులో ఇరుక్కున్న తన భర్తను కాపాడుకోవడానికి కీర్తి (Keerthy Suresh) చేసే న్యాయ పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ వీడియోలో కీర్తి సురేశ్ చెప్పే డైలాగ్స్, ఆమె బాడీ లాంగ్వేజ్, సినిమాలో ఉండే కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని స్పష్టం చేస్తున్నాయి.
Also Read : ‘రామాయణ’ సంచలనం.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్!
Follow Us On : WhatsApp

