కలం, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) చెన్నైలోని కొలత్తూరులోని సర్కార్ బడిలో జరిగిన చిల్డ్రన్స్ డే (Childrens Day)వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా టీచర్లకు, విద్యార్థులకు విజయ్ స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన 61.84 లక్షల మంది టీచర్లు, విద్యార్థులకు, సిబ్బందికి రూ.9.27 కోట్లతో కేకులు పంపిణీ చేశారు. విద్యార్థులకు స్వయంగా కేకులు పంచి పెడుతూ విషెస్ కార్డులు కూడా అందజేశారు.
సీఎం విజయ్ క్లాస్ రూమ్స్‌లో విద్యార్థుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరితో మాట్లాడి సరదాగా గడిపారు. సీఎం విజయ్ (CM Vijay) విద్యార్థులకు అందజేసిన కార్డులపై ఆల్ ఈజ్ వెల్..స్టే స్ట్రాంగ్ అనే సందేశంతో పాటు బాలల దినోత్సవ శుభాకాంక్షలు ముద్రించారు. సీఎంగా విజయ్ మే నెలలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుపుకుంటున్న తొలి చిల్డ్రన్స్ డే ఇదే కావడం విశేషం. అలాగే రాష్ట్రంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం కేకులు పంపిణీ చేయడం ఇదే తొలిసారి. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు అనుగుణంగా ఈ కేకులను తయారు చేశారు. తమిళనాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టెండర్ల ద్వారా నాలుగు ప్రముఖ తయారీ సంస్థల నుంచి కేకులను కొనుగోలు చేసింది.
Also Read : మోదీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

