ఫ్లైఓవర్స్ కోసం చెట్ల తొలగింపు.. డ్రోన్ వాడారంటూ యాక్టివిస్టులపై కేసు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద గత కొద్దిరోజులుగా ఉద్రిక్తత నెలకొంటుంది. పార్క్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అధికారులు చెట్లను తొలగిస్తుండటమే అందుకు కారణం. తాజాగా సేవ్ కేబీఆర్ బృందంతో సోషల్ యాక్టివిస్ట్ విజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని, అనుమతి లేకుండా డ్రోన్ వినియోగించారనే ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీసులు విజయ్‌తో‌ (Activist Vijay) పాటు అతని అనుచరులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే, పోలీసులు అక్రమంగా తప్పుడు కేసులు బనాయించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విజయ్ ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై పర్యావరణ ప్రేమికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>