కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెన్త్ ఫలితాల (AP SSC Results 2026) విడుదలపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. మార్చి 2026లో నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఫలితాలు తెలుసుకునే మార్గాలు:
విద్యార్థులు తమ ఫలితాలను క్రింది ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పొందవచ్చు.
• SSC ఫలితాల పోర్టల్: https://results.bse.ap.gov.in
• Mana Mitra WhatsApp: 9552300009 నంబర్‌కు “Hi” అని పంపండి
• LEAP మొబైల్ యాప్ (విద్యార్థుల కోసం కూడా)
• DigiLocker (యాప్ & వెబ్‌సైట్)
అలాగే, హెడ్మాస్టర్‌లు తమ స్కూల్ లాగిన్‌ల ద్వారా ఫలితాలను డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ (Nara Lokesh) విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్యాలను సాధించిన వారికి అభినందనలు తెలియజేస్తూ, ఆశించిన ఫలితాలు రాని వారు నిరుత్సాహపడవద్దని సూచించారు. ‘ఇది జీవితంలో ఒక మైలురాయి మాత్రమే, అంతిమ గమ్యం కాదు. మీపై నమ్మకం ఉంచుకుని ముందుకు సాగండి’ అని ప్రోత్సహించారు.

