మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్

కలం, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో 87వ రోజు మంత్రి లోకేశ్ (Minister Lokesh) ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి తానున్నానంటూ భరోసా ఇచ్చారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను అక్కడినుంచి తరలించకుండా కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. సిబ్బందికి న్యాయం చేస్తానని చెప్పారు.

ఆచార్య నాగార్జున వర్సిటీలో గత 20 ఏళ్లుగా పని చేస్తున్న దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆల్ వర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ దినసరి ఉద్యోగుల కమిటీ ప్రతినిధులు లోకేశ్​ను (Minister Lokesh) కోరారు. వారి వినతులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో తమకు వంశపారంపర్యంగా వచ్చిన 2.63 ఎకరాల భూమిని శిరిగిరి చంద్రమౌళీశ్వరరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని కర్నూలు జిల్లా గుండంపాడుకు చెందిన చిన్న శివమ్మ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి.. పూర్తి విచారణ చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

Read Also: పాదయాత్ర ముహూర్తం ఫిక్స్ చేసిన వైఎస్ జగన్ !

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>