కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న “ఆడుదాం ఆంధ్రా” (Aadudam Andhra) అవినీతి కేసు మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి రోజా (Roja), బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై (Byreddy Siddharth Reddy) ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సిద్ధం చేసిన సుమారు 3 వేల పేజీల నివేదిక ప్రభుత్వానికి సమర్పించబడింది. రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా ప్రాంతాల్లో నిర్వహించిన విచారణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడినట్లు తెలుస్తోంది.
ప్రారంభంలో రూ. 40 కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్ట్ వ్యయం, తర్వాత రూ. 125 కోట్లకు పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. ఇందులో సుమారు రూ. 40 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు సిఫారసు చేసినట్లు సమాచారం.
ఈ నివేదిక ఆధారంగా కేసును ఏసీబీ లేదా సీఐడీకి అప్పగించే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వ్యవహారంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) స్పందిస్తూ.. ‘ఆడుదాం ఆంధ్రా'(Aadudam Andhra) పేరుతో పేద క్రీడాకారుల హక్కులను దోపిడీ చేశారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.
Read Also: పాదయాత్ర ముహూర్తం ఫిక్స్ చేసిన వైఎస్ జగన్ !
Follow Us On: Instagram

