కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టోల్ ఛార్జీలపై కేంద్రానికి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారికోసం టోల్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై తెలంగాణ వాదుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ వాళ్లు కూడా తద్వారా ప్రయోజనం కలుగుతుందని.. ఇతర తెలంగాన జాతీయ రహదారులపై కూడా పండుగలకు వెళ్లే వారికి టోల్ మినహాంపుపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. టోల్ ప్లాజాలు కేంద్రం ఆధీనంలో ఉన్నందున సంక్రాంతి పండుగకు సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీకి లేఖ రాసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణలో అతి పెద్ద జాతర అయిన మేడారం జాతరకు వెళ్లే భక్తులకు కూడా టోల్ చార్జీల రద్దు కోరుతామని వెల్లడించారు. పండుగలకు టోల్ ఛార్జీల రద్దు అంశంలో ఎలాంటి వివక్షత, వివాదానికి అవకాశం లేదని మంత్రి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) స్పష్టం చేశారు.
Read Also: బస్ డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడిదాకా… సత్యసాయి బాబా ఫాలోవర్ మాదురోకు ట్రంప్ షాక్!
Follow Us On: Instagram


