epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విజయ్ హజారే ట్రోఫీలో పాండ్య వీరవిహారం

కలం, వెబ్​ డెస్క్ : విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్​ పాండ్య  (Hardik Pandya) వీరవిహారం చేశాడు. ఒక్క ఓవర్‌లో 34 పరుగులు బాది సెంచరీ చేశాడు. గ్రూప్ దశలో విదర్భతో జరిగిన మ్యాచ్‌లో పాండ్య ఈ ఆట ఆడాడు. బరోడా తరఫున ఒక్క ఓవర్‌లో 34 పరుగులు సాధించాడు. అందుకోసం వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. 68 బంతుల్లో శతకం పూర్తిచేసి అభిమానులను ఉర్రూతలూగించాడు.

జట్టు 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్య ఇన్నింగ్స్‌ను తన భుజాలపై మోశాడు. సోదరుడు కృణాల్ పాండ్యతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరును ముందుకు నడిపాడు. 39వ ఓవర్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పార్థ్ రేఖాడేపై ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ దిశను మార్చాడు.

ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టే అరుదైన ఘనత తృటిలో కోల్పోయినా చివరి బంతికి ఫోర్ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. 46వ ఓవర్‌లో యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో హార్దిక్ (Hardik Pandya) ఔటయ్యాడు. 92 బంతుల్లో 133 పరుగులు సాధించిన హార్దిక్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు పదకొండు సిక్సర్లు ఉన్నాయి. ఈ మెరుపు ప్రదర్శనతో బరోడా కష్టమైన ఆరంభం తర్వాత 258 పరుగులకు ఎనిమిది వికెట్లు సాధించింది.

Read Also: కోహ్లీని దాటేసిన రుతురాజ్.. మరో రికార్డ్..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>