కలం, వెబ్ డెస్క్: అమెరికా పేపర్ కరెన్సీ (డాలర్ నోట్ల)పై త్వరలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం కనిపించనుంది. 1861లో డాలర్ బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత, పదవిలో ఉన్న ఒక అధ్యక్షుడి సంతకం కరెన్సీపై ముద్రించడం ఇదే తొలిసారి. అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా యూఎస్ ట్రెజరీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సంతకాలు త్వరలో యూఎస్ కరెన్సీపై కనిపిస్తాయని.. ఇది చరిత్రలో ఒక మైలురాయి అని యూఎస్ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతేకాదు ఈ 250వ వార్షికోత్సవ వేడుకల కోసం ట్రంప్ చిత్రం ఉన్న 24 క్యారెట్ల బంగారు స్మారక నాణెం తుది రూపకల్పనకు కూడా ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఆమోదముద్ర వేసింది.
1861 నుంచి అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరర్, ట్రెజరీ కార్యదర్శి సంతకం ఉండడం సంప్రదాయంగా వస్తోంది. ఈ 165 ఏళ్ల సంప్రదాయాన్ని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పుడు బ్రేక్ చేయనున్నారు. టెజ్రరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌తో పాటు ట్రంప్ సంతకం ఉన్న తొలి 100 డాలర్ల నోట్లను జూన్‌లో ముద్రించనున్నట్లు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
Read Also: దేశంలో ఎరువుల కొరత లేదు.. జేపీ నడ్డా స్పష్టీకరణ
Follow Us On: Facebook

