హార్దిక్ పాండ్యా ఒంటరి అయ్యాడు: మనోజ్ తివారి

కలం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడో ఓటమిని మూటగట్టుకున్న ముంబై, ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుస వైఫల్యాలతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary) అతనికి మద్దతుగా నిలిచారు. ముంబై ఓటములకు కేవలం హార్దిక్ ఒక్కడే కారణం కాదని, జట్టులోని ఇతర ఆటగాళ్ల నుంచి అతనికి సరైన సహకారం అందడం లేదని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్‌పై విమర్శలు రావడం సహజమే అయినా, మైదానంలో హార్దిక్ ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు.

ముంబై జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి అంతర్జాతీయ స్థాయి కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ, క్లిష్ట సమయాల్లో వ్యూహాత్మకంగా జట్టు విఫలమవుతోందని ఆయన (Manoj Tiwary) పేర్కొన్నారు. జట్టులోని కీలక ఆటగాళ్లు నిలకడగా రాణించడం లేదని తివారీ గుర్తు చేశారు. సూర్యకుమార్ యాదవ్ ప్రతిరోజూ మెరుపులు మెరిపించలేకపోతున్నారని, తిలక్ వర్మ ఒక మ్యాచ్‌లో బాగా ఆడినా ఆ ఫామ్‌ను కొనసాగించడంలో తడబడుతున్నారని విమర్శించారు. ఇలాంటి అస్థిరమైన ఆటతీరు ఉన్నప్పుడు ఫలితాలు ఆశించడం కష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: భారీ ధరకు అమ్ముడైన అర్జున్ టెండూల్కర్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>