కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వనరులున్నాయని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) అన్నారు. తెలంగాణలో లేని విధంగా ఇక్కడ 974 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సముద్రతీరం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ అత్యాధునిక సినీ స్టూడియోల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, షూటింగ్‌లకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. ఏపీకి వచ్చే సంస్థలకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో సహకరిస్తామని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రి దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

