Mobile Popup Ad
Mobile Popup Ad

మ‌హిళా సాధికారిత‌ ప్రజా ప్ర‌భుత్వం ల‌క్ష్యం: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు (Women Empowerment) అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప‌ర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండ‌ల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను మంత్రి లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టీరింగ్ పట్టి బస్సును కొద్ది దూరం నడిపారు. అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి, ఆదాయ వనరులు కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వారి ఆర్థిక స్వావలంబన మరింత బలోపేతం అవుతుందన్నారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి (Jupally Krishna Rao ) స్పష్టం చేశారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత ముందుకు సాగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని కోరారు. అప్పుడే ఆర్టీసీ లాభాల బాటల్లో పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్ర‌జాప్ర‌తినిధులు, మహిళ సంఘాల స‌భ్యులు పాల్గొన్నారు.

Read Also: సోలార్ ప్లాంట్ పెట్టండి.. లాభాలు ఆర్జించండి: బండి సంజయ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>