సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నాం : మంత్రి దామోదర్

కలం, మెదక్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Raja Narsimha) తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ఆందోల్ మండలం అల్మాయిపేటలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి గ్రామంలో మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

అందోల్ ప్రాంతంలో ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని కోరారు. ఆందోల్ (Andole) నియోజకవర్గంలో త్వరలో ఫార్మసీ కళాశాల స్థాపన జరుగుతుందని, సంగుపేట గుట్ట వద్ద రెండుమూడు పరిశ్రమలు రానున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రైతు భీమా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఎన్నో అమలు చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narsimha) చెప్పారు.

Read Also: ఏపీ టు తెలంగాణ.. ఐఏఎస్ ఆఫీసర్ వాణీ ప్రసాద్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>