కలం, వెబ్ డెస్క్: ఆధార్ అప్‌డేట్, ఉపాధి హామీ పథకం అటెండెన్స్ కోసం కేవైసీ (KYC) అనివార్యమైంది. అయితే టెక్నికల్ ఇష్యూస్ సామాన్యులకు ఇబ్బందిగా మారుతున్నాయి. కళ్లు చిన్నగా ఉండటం, వేలిముద్రలు పడకపోవడం, తల వెంట్రుకలు సరిగ్గా లేకపోవడం లాంటి కారణాలతో బయోమెట్రిక్ అప్‌డేట్‌లు ఫెయిల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగాలాండ్ మంత్రి స్వయంగా విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సమస్య మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
బయోమెట్రిక్ స్కానర్ కళ్లను గుర్తించకపోవడంతో, స్కాన్ కోసం ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఒక వ్యక్తి కళ్లు తెరిపించాల్సి వచ్చింది. ఈ ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ప్రజల శారీరక లక్షణాలకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సౌకర్యవంతంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం సాంకేతిక లోపాల కారణంగా నిరుపేదలు, వృద్ధులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తేవాలని ప్రజలు సైతం డిమాండ్ చేస్తున్నారు.
బయోమెట్రిక్ స్కాన్ కష్టాలు
-ఈశాన్య రాష్ట్రాల్లో ఆధార్, ఉపాధి హామీ KYC తిప్పలు
-కొందరి కళ్లను గుర్తించలేకపోతున్న బయోమెట్రిక్ స్కానర్
-నాగాలాండ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వీడియో ద్వారా తెలిపిన మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలంగ్
Nagaland Minister Temjen Imna Along Highlights… pic.twitter.com/iGj9GGoEUB— Kalam Daily (@kalamtelugu) August 12, 2026

