ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ల‌క్ష్యంగా ప‌ని చేస్తాం: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) అన్నారు. ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుగ్గారం మండలంలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు.

బుగ్గారం (Buggaram) మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా చిన్నాపూర్ గ్రామంలో రూ. 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. గ్రామంలో మహిళా సంఘాల కొరకు ఇప్పటికే వివో భవనానికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు. బుగ్గారం మండల కేంద్రంలోని సాంబశివుని ఆలయం వద్ద రూ.20 లక్షలతో నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వచ్చే శివరాత్రి లోపు కళ్యాణ మండప పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బుగ్గారం జిల్లా పరిషత్ పాఠశాలలో రూ. 20 లక్షలతో చేపట్టిన గ్రంథాలయ నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

యశ్వంత రావు పేట (Yeshwanthraopet) గ్రామంలో రూ.37.45 లక్షలతో యశ్వంతరావుపేట పెద్ద చెరువు నుండి బొల్లి చెరువు ప్రాజెక్టు వెలుగొండ వరకు సాగునీటి కాలువ అత్యవసర పనులకు మంత్రి (Adluri Laxman) శంకుస్థాపన చేశారు. యశ్వంతరావు పేట ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. బుగ్గారం మండలం శేకల్ల గ్రామంలో రూ 16.10 లక్షలతో చేపట్టిన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, రూ. 10 లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

Read Also: ఈసారి డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు: కేటీఆర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>