Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

కలం, వరంగల్ బ్యూరో : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. వరంగల్ (Warangal) జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ మేడారపు సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలు, సేవలను అధికారికంగా గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం. 679ను విడుదల చేయడం, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ముందడుగు వేస్తుందని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నేడు తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిరుద్యోగ జేఏసి నాయకులు గనిపాక క్రాంతి కుమార్, సుధగాని మధు, అరుణ్ కుమార్, రవి, సాయి, వెంకటేష్ , అన్వేష్, రాజ్ కుమార్, కుమారస్వామి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Read Also:  తలనొప్పి ప్రదేశాల రహస్యాలు.. ఏ భాగంలో నొప్పి వస్తే ఏ సమస్యో తెలుసా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>