కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) నియోజకవర్గం వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని మాజీ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) పరిశీలించారు. ఈ మధ్య ఈ పనులను ఆయన పరిశీలించడం ఇది మూడోసారి. రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత లోపం లేకుండా చూడాలని కాంట్రాక్టర్ కు సూచించారు. పోచారం వెంట వర్ని, బాన్సువాడ గ్రామీణ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, సిద్దాపూర్ చుట్టూ ప్రక్కన గ్రామాల ప్రజలు ఉన్నారు.
గతంలో ఇదే రిజర్వాయర్ పనుల విషయంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) ఇటీవల అక్కడికి వెళ్లి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇదేం ప్రభుత్వం మంత్రులు ఫోన్ లు లిఫ్ట్ చేయరు. సీఎం రేవంత్ రెడ్డికి నిధుల గురుంచి 20 సార్లు చెప్పాను. అయినా ప్రయోజనం లేదు’ అని రిజర్వాయర్ వద్ద బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అవి మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రుల్ని ఇరకాటంలో పెట్టాయి. నిధుల కొరత ఉందని పోచారం అర్థం చేసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే రిజర్వాయర్ (Siddapur Reservoir) పనులను పోచారం పరిశీలించారు.. నిధుల సమస్య తీరిందా లేదా మరి పోచారం సర్ గుస్సా తగ్గిందా? అనేవి తెలియాల్సి ఉంది.
Read Also: బండి భగీరథ్ ఇష్యూ.. తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్
Follow Us On: Instagram

