కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో భారత్‌లో గ్యాస్ కొరత (Gas Shortage) తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో గ్యాస్ కోసం జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు కూడా చేస్తున్నారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేటు హాస్టళ్లు మూతపడుతున్నాయి. మరికొన్ని చోట్ల నిర్వాహకులు కట్టెలపొయ్యితో నెట్టుకొస్తున్నారు. ఇక ఆలయాల్లో ప్రసాదాల తయారీకి సైతం గ్యాస్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా పాఠశాలల్లో గ్యాస్ లేక విద్యార్థులకు ఫుడ్ పెట్టడమే కష్టంగా మారింది. దీంతో పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని ఓ పాఠశాలలో పిల్లల ఆకలి తీర్చేందుకు టీచర్ మరో దారి ఎంచుకున్నారు. ఓ చిరు వ్యాపారితో మాట్లాడి పిల్లలకు పానీ పూరీని మధ్యాహ్న భోజనంగా అందించారు. ఒక్కొకక్కరికీ పది పానీ పూరీలు వేశారు. వీటి కోసం పిల్లలు ప్లేట్లు పట్టుకొని క్యూలో నిల్చున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న నందితా సర్కార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్యాస్ కష్టాలతో చివరికి స్కూల్ పిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితి వచ్చిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
-వెస్ట్ బెంగాల్ స్కూళ్లలో వంట గ్యాస్ కష్టాలు
-పిల్లలకు స్నాక్స్ బదులు పానీపూరీ..!
Viral Video: LPG Crisis Hits West Bengal Schools; Students Served ‘Panipuri’ for Snakcs #WestBengal #LPGShortage #Panipuri #School #Snakcs #PanipuriAsSnakcs #LPGCrisis #ViralVideo #Kalam… pic.twitter.com/crE5IR5VUt— Kalam Daily (@kalamtelugu) March 16, 2026
Read Also: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Follow Us On: Instagram

