పెళ్లి చేసుకుంటున్నారా.. ఈ ఆర్థిక సూత్రాలు తెలుసుకోవాల్సిందే!

కలం, వెబ్ డెస్క్: పెళ్లి (Marriage) అంటే కేవలం వేడుకలను ప్లాన్ చేసుకోవడమే మాత్రమే కాదు.. కాబోయే భాగస్వామితో ఆర్థిక విషయాలపై (Money Lessons) చర్చించడం ముఖ్యం. దాపరికం లేని ఆర్థిక సంభాషణలు వైవాహిక జీవితాన్ని సుఖమయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందే ఇద్దరి సంపాదన, అప్పులు, క్రెడిట్ స్కోర్ వంటి విషయాలను ఒకరికొకరు స్పష్టంగా వివరించడం మొదటి పాఠం. అలాగే, భాగస్వామి పొదుపు చేసే స్వభావం గలవారా, విచ్చలవిడిగా ఖర్చు చేసేవారా అని తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే మనస్పర్థలను నివారించవచ్చు.

ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం, అత్యవసర నిధిని (ఎమర్జెన్సీ ఫండ్) ఏర్పాటు చేసుకోవడం పెళ్లికి ముందే అలవర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు. ఇద్దరికీ వేర్వేరు బ్యాంక్ ఖాతాలు ఉన్నప్పటికీ, ఉమ్మడి ఖర్చుల కోసం ఒక జాయింట్ అకౌంట్ నిర్వహించడం, నెలవారీ బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక ఇల్లు కొనడం, పిల్లల చదువులు, పదవీ విరమణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇద్దరూ కలిసి పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోవాలి. ప్రేమతో పాటు ఆర్థిక పరమైన అనుకూలత ఉన్నప్పుడే ఆ వైవాహిక బంధం విజయవంతంగా ముందుకు సాగుతుంది.

Read Also: చిన్న మార్పులు, పెద్ద ఫలితాలు.. వయసు పెరిగినా చురుగ్గా ఉంచే ‘మైక్రో హాబిట్స్’

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>