epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మెస్సీ టూర్​ ఏర్పాట్లపై గవర్నర్​ ఫైర్​​.. ఈవెంట్​ ఆర్గనైజర్​ అరెస్ట్​

కలం, వెబ్​ డెస్క్​ : అర్జెంటీనా ఫుట్​ బాల్​ దిగ్గజం మెస్సీ (Messi) శనివారం కొల్కతాలో నిర్వహించిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈవెంట్​ ఆర్గనైజర్​ ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ’గోట్​ టూర్ ఆఫ్​ ఇండియా‘ లో భాగంగా మెస్సీ భారత్​లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొల్కతాలోని(Kolkata) సాల్ట్​ లేక్​ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మెస్సీ పాల్గొన్నారు. అయితే మెస్సీ స్టేడియం నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తూ బాటిళ్లు, కుర్చీలు గ్రౌండ్​ లోపలికి విసిరేశారు.

మెస్సీ (Messi) వెళ్లిపోయిన అనంతరం గ్రౌండ్​ లోకి వెళ్లిన ఫ్యాన్స్​ ఆగ్రహంతో వస్తువులను విరగొట్టారు. మెస్సీ పర్యటనకు సరైన ఏర్పాట్లు చేయలేదని, టికెట్లు కొనుక్కుని వెళ్తే కనీసం మెస్సీని చూడకుండానే తిరిగొచ్చామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్​ కతా మెస్సీ పర్యటన ఏర్పాట్లపై ఆ రాష్ట్ర గవర్నర్​ సీ.వీ ఆనంద్​ బోస్​ (C.V Anand Bose) ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్ట్​ లేక్​ స్టేడియం ఘటనపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై అంతకుముందు పశ్చిమ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) క్షమాపణలు చెప్పారు. సాల్ట్​ లేక్​ స్టేడియంలో గందరగోళం నెలకొనడంతో మెస్సీకి, క్రీడాభిమానులకు సారి చెప్పారు. మెస్సీ టూర్ లో నిర్వహణ లోపంపై విచారణ కమిటీ వేస్తూ సీఎం మమత బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.

Read Also: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల మార్గదర్శకాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>