కలం, వెబ్ డెస్క్: ఐబొమ్మ రవి పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ సినిమాల పైరసీకి చెక్ పడటం లేదు. ఇటీవల విడుదలైన సినిమాలతోపాటు అఖండ2 సినిమా పైరసీ కావడంతో సీపీఐ నారాయణ (CPI Narayana) రియాక్ట్ అయ్యారు. ఐబొమ్మ రవిని ఉరి తీయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, దీని వల్ల పైరసీ ఆగదని అయన అన్నారు. రవి పోలీస్ కస్టడీలో ఉండగానే అఖండ-2 పైరసీ ఎలా వచ్చింది? ఆయన ప్రశ్నించారు. ఫైరసీకి మూలం ఎక్కడుంది? దానికి ఆధారాలు ఎక్కడ లభ్యం అవుతున్నాయని సందేహించారు. వ్యవస్థీకృతమైన లోపాలు వల్లే పైరసీ పుట్టుకొస్తోందని నారాయణ అన్నారు.
టికెట్ ధరలు పెంచుకొని కేవలం లాభాలు రాబట్టుకోవాలి అంటే ఎలా కుదురుతుందని టాలీవుడ్ (Tollywood) హీరోలపై సెటైర్లు వేశారు. ప్రజలపై భారం మోపడం వల్లే వాళ్లు ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారని నారాయణ అన్నారు. సినిమా థియేటర్లలో అక్రమ వ్యాపారం, తినుబండారాలపై ధరలను అరికట్టాలని, ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ నారాయణ అన్నారు.
ఐబొమ్మ రవి పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ, సినిమాలు పైరసీ అవుతున్నాయి. ఐబొమ్మ రవి తర్వాత పోలీసులు ఇతర అరెస్టులు చేయలేదు. పైరసీ కారణంగా సినిమాలకు నష్టం జరుగుతోంది. వీలైనంత త్వరగా పోలీసులు చర్యలు తీసుకోవాలని సినీ నిర్మాతలు కోరుతున్నారు.
Read Also: సర్పంచ్ ఫలితాలు.. పార్టీలు ఏం నేర్చుకోవాలి..?
Follow Us On: X(Twitter)


