కలం, వెబ్ డెస్క్ : సర్పంచ్ ఎన్నికల (Sarpanch Elections) ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ అన్ని పార్టీలకు డిఫరెంట్ రిజల్ట్ ఇచ్చింది. అసలు పట్టు లేదు అనుకున్న జిల్లాల్లో కాంగ్రెస్ కు భారీ సీట్లు ఒచ్చినయ్. బీఆర్ ఎస్ కు బలం ఉన్న జిల్లాల్లో గులాబీ రెక్కలు విచ్చుకోలేదు. బీజేపీకి అసలు ఇలాంటి రిజల్ట్ ఎవరూ ఊహించి ఉండరేమో. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం గ్రామాల్లోనే తిరిగారు. పార్టీ నుంచి ప్రతి గ్రామంలో ఒక్క అభ్యర్థి మాత్రమే నిలబడేలా చూశారు. ఎమ్మెల్యేలకు టార్గెట్లు ఫిక్స్ చేసి బాధ్యతలు ఇచ్చినా సరే 55 శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఒచ్చింది. 4 వేల 236 పంచాయతీలకు ఫస్ట్ ఫేజ్ లో ఎలక్షన్ జరిగితే.. ఇందులో 2 వేల 335 పంచాయతీలు కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రం మొత్తంలో నల్గొండనే మళ్లీ టాప్ లో ఉంది. ఇక్కడ 200 పంచాయతీలు హస్తం పార్టీ గెలిచింది. కానీ నిజమాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ వెనకబడ్డది. ఇక్కడ బీఆర్ ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ కు గ్రామాల్లో ఒకప్పటికంటే ఇప్పుడు క్యాడర్ బలం పెరిగింది. 90 శాతం సీట్లు సాధిస్తామని చెప్పినా కాంగ్రెస్ ఆ రిజల్ట్ అందుకోలేదు.
బీఆర్ ఎస్ 1168 పంచాయతీలు గెలుచుకుంది. అంటే 27.5 పర్సెంట్. ఇదేం తక్కువ కాదు. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్న పార్టీకి ఇన్ని సీట్లు రావు. మహబూబ్‌నగర్, వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కారు పార్టీకి మంచి సీట్లే వచ్చాయి. ఇది ఒక రకంగా ఆ పార్టీకి మంచిదే. కానీ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఈ రిజల్ట్ గ్రామాల్లో సరిపోదు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో ఎక్కువ లాభం జరిగింది పల్లెటూరి జనాలకే అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అలాంటి పల్లెల్లో కారు పట్టు ఇంత తక్కువగా ఉండటమేంటి. దీన్ని పెంచుకోకపోతే కారు స్పీడ్ పెరగదు.
బీజేపీ సర్పంచ్ ఎన్నికల ((Sarpanch Elections)ను పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటున్నారు. కానీ రిజల్ట్ ఇలా ఉంటే ఆ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుంది. అసలు సాధ్యమేనా ఇది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సారి గ్రామాల్లో పెద్దగా తిరగలేదు. తమ అనుచరులు, కార్యకర్తల గెలుపు కోసం రాకపోవడం ఆ పార్టీ కేడర్ లో తీవ్ర నిరాశకు గురి చేసింది. బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు లాంటి వాళ్లు తమ పార్టీ వాళ్లను గెలిపిస్తే ఆ ఊర్లకు రూ.15లక్షలు ఇస్తామన్నారు. కానీ వాటిని కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి బీజేపీ ఇక నుంచి అయినా బలంగా ప్రయత్నిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి.
Read Also: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల మార్గదర్శకాలు
Follow Us On: Sharechat


