మధిర సమీపంలో రైలు ప్రమాదం.. ప్రయాణికుడు మృతి!

కలం, మధిర: ఖమ్మం జిల్లా మధిర సమీపంలో జరిగిన రైలు ప్రయాణంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. చెన్నై నుంచి జార్ఖండ్‌కు రైలులో వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తొండల గోపవరం – మధిర మధ్య దెందుకూరు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ​వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం కిలోమీటర్ నంబర్ 535/19–21 అప్ లైన్ వద్ద ఉజ్వల్ బండారి (44, తండ్రి: ఆనంద్ బండారి) చెన్నై నుంచి జార్ఖండ్‌కు ఓ రైలులో ప్రయాణిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆయన రైలు నుంచి కిందపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ​సమాచారం అందుకున్న సీహెచ్ వెంకటేశ్వరరావు ఉత్తర్వుల మేరకు మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్. వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని మధిర ఆర్కే ఫౌండేషన్ సహకారంతో పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>