Mobile Popup Ad
Mobile Popup Ad

‘జన నాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన

కలం, సినిమా : సినిమా పైరసీపై ఆందోళన వ్యక్తం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కీలక వ్యాఖ్యలు చేశారు. దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమా లీక్ అవ్వడం బాధాకరమని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సినిమా అనేది నమ్మకం, కష్టం, అనేక మంది కలల సమాహారమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మొత్తం సినీ పరిశ్రమను ప్రభావితం చేస్తాయని, సృజనాత్మక కృషిని కాపాడటం ఎంతో అవసరమని ఆయన అన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని చిరంజీవి (Chiranjeevi) స్పష్టం చేశారు. లీక్‌కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమాను గౌరవించి, పైరసీని అరికట్టాలని పిలుపునిచ్చిన చిరంజీవి.. ‘పైరసీని నిర్మూలించండి… సినిమాను కాపాడండి’ అని సందేశం ఇచ్చారు.

Read Also: కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. కానీ ఆ 30 నిమిషాలే సమస్య!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>