కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ఈ నెల 12న తేదీన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను (Inter Results) విడుదల చేయనుంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. తుది ఫలితాల క్రోడీకరణలో బోర్డు నిమగ్నమై ఉంది. సుమారు 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ఫలితాలను ఏకకాలంలో విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

