రేపు ఎంజీయూలో మెగా టీచర్ రిక్రూట్మెంట్ డ్రైవ్

కలం, నల్లగొండ : ఇన్నోక్యుటర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా టీచర్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ (Mega Teacher Recruitment Drive) కు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) ఆతిథ్యం ఇవ్వనుంది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ నియామకాల కోసం సోమవారం (మే 11) ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డా. హరీష్ కుమార్ తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఉదయం 9 గంటలకు ఎంజీయూ క్యాంపస్‌కు చేరుకోవాలని ఆయన సూచించారు. అలాగే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 7660055100 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>