కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ.. రంగంలోకి మీనాక్షి నటరాజన్!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో (Congress Party) నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రంగంలోకి దిగారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్ పదవుల జాబితాను వడపోసి, అర్హులైన అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఫైనల్ లిస్ట్‌ను సిద్ధం చేస్తారు. తుది ఆమోదం కోసం ఏఐసీసీ (AICC) అధిష్టానానికి పంపించనున్నారు.

మరోవైపు నామినేటెడ్ పదవుల ప్రకటన వెలువడనుందనే వార్తలతో పార్టీలోని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, గత ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన వారు ఈ జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనన్న టెన్షన్‌లో ఉన్నారు. పదవుల రేసులో పోటీ ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) పర్యటనతో ఈ సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: అధికారముంటేనే వెళ్తారా?.. క్రెడిట్ కోసమే అంబేద్కర్ విగ్రహమా?..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>