Mobile Popup Ad
Mobile Popup Ad

అంబేద్కర్‌ను రాజకీయాల కోసం వాడుకున్న కాంగ్రెస్: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బాబాసాహెబ్ అంబేద్కర్‌ (Ambedkar)ని రాజకీయ అవసరాల కోసం వాడుకుందే తప్ప గౌరవించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. 1952, 1954లో ఆయన పార్లమెంటుకు రాకుండా కాంగ్రెస్ కుట్రలు చేసి ఓడించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మహిళలకు హక్కులు కల్పించాలని ఆయన చూస్తే, దాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కాలంలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదన్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చినప్పుడే ఆయనకు ఆ గౌరవం దక్కిందన్నారు. చివరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆయన ఫోటో పెట్టడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ దళితబంధు (Dalita Bandhu) కింద రూ.10 లక్షలు ఇస్తే, తాము రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్‌కి ‘అంబేద్కర్ అభయహస్తం’ (Ambedkar Abhaya Hastham) అని పేరు పెట్టారని కేటీఆర్ (KTR) అన్నారు. కానీ ఇవాళ దాన్ని అమలు చేయకుండా అటు దళితులను, ఇటు బాబాసాహెబ్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలు తేవాలంటే నాయకుడికి ఖలేజా ఉండాలని. ఆ ఖలేజా ఉన్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. చేవెళ్ళలో మల్లికార్జున ఖర్గేని పిలిచి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు.

ఈ డిక్లరేషన్‌లో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. ఎస్టీలకు 10 శాతం ఉన్న రిజర్వేషన్ ను 12 శాతం చేస్తామని చెప్పి చేయలేదని దుయ్యబట్టారు. మిగతా వర్గాల ఇండ్లకు రూ. 5 లక్షలు ఇస్తే.. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు జాగ లేకపోతే జాగ కూడా ప్రభుత్వమే ఇస్తదని చెప్పి ఇవ్వకుండా వంచించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు టెన్త్ పాస్ అయితే రూ.10,000, 12వ తరగతి పాస్ అయితే రూ. 15,000, డిగ్రీ పాస్ అయితే రూ. 25,000, పీజీ పాస్ అయితే రూ. 1,00,000, పీహెచ్‌డీ చేస్తే రూ. 5,00,000 ఇస్తామని చెప్పి నమ్మబలికి ఏదీ అమలు చేయలేదన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో మోసం చేశారని ఫైర్ అయ్యారు.

Read Also: చీరలో డాన్స్ చేస్తే తప్పా..? యువతి కన్నీరు !

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>